RAIDS AT MUTTON SHOPS : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని మాంసం, చేపల మార్కెట్లపై నగరపాలక సంస్థ అధికారులు.. దాడులు నిర్వహించారు. వెటర్నరీ ఆఫీసర్ రవిచంద్ పర్యవేక్షణలోని సిబ్బంది.. దుర్గాపురం, మాచవరం, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. మాచవరంలో 25 కిలోల నిల్వ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుర్గాపురం చేపల మార్కెట్లో పరిశుభ్రత పాటించని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. నిల్వ ఉన్న మాంసం, బీఫ్ కలిపిన మాంసం విక్రయించే వారిపై దాడులు నిర్వహించి.. అపరాధరుసుం వసూలు చేశామని నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ రవిచంద్ తెలిపారు.
'కార్పొరేషన్ పరిధిలో చేపల మార్కెట్లో మాంసం విక్రయదారులపై దాడులు నిర్వహిస్తున్నాం. మాకు కొందరు అజ్ఞాత వ్యక్తులు నిల్వ మాంసం, బీఫ్ కలిపిన మాంసం విక్రయిస్తున్నట్లు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పలుచోట్ల నిల్వ ఉంచిన మాంసం గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. వ్యాపారులకు జరిమానా విధించాం. మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. నిల్వ మాంసం విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవు. మలేరియా డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచాలి.' -రవిచంద్, పశువైద్యాధికారి
ఇవీ చదవండి: