ETV Bharat / city

Municipal Council Meetings : ప్రతినెలా నగర, పురపాలికల కౌన్సిల్ సమావేశాలు తప్పనిసరి - తెలంగాణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు

Municipal Council Meetings : తెలంగాణలోని అన్ని నగర, పురపాలికల కౌన్సిల్ సమావేశాలు ఇక నుంచి ప్రతి నెలా తప్పనిసరిగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఈ సమావేశాల నిర్వహణ నిబంధనల నోటిఫికేషన్​ను పురపాలక శాఖ జారీ చేసింది.

Municipal Council Meetings :
Municipal Council Meetings :
author img

By

Published : Dec 25, 2021, 9:17 AM IST

Municipal Council Meetings : రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలికల కౌన్సిల్ సమావేశాలు ప్రతి నెలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ .. కౌన్సిల్ సమావేశాల నిర్వహణ నిబంధనల నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిబంధనలు వెలువరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

సాధారణ మెజారిటీతోనే తీర్మానాలు..

Telangana Municipal Council Meetings : సగానికి మించి సభ్యులు లిఖితపూర్వకంగా కోరినా లేదా అత్యవసర సమయాల్లో కౌన్సిల్​ను సమావేశపరచవచ్చు. సమావేశం నిర్వహణకు మూడో వంతు మంది సభ్యుల కోరం తప్పనిసరి. సాధారణ మెజారిటీతోనే కౌన్సిల్​లో తీర్మానాలు చేయవచ్చు. ఒకసారి కౌన్సిల్​లో చేసిన తీర్మానాలను మూడు నెలల లోపు సవరణ లేదా రద్దు చేయరాదు. ఒకవేళ చేయాల్సి వస్తే ప్రత్యేక సమావేశం నిర్వహించి మూడింట రెండొంతుల మెజారిటీతోనే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సభ్యులు నిర్ణయంపై అసమ్మతి ప్రకటిస్తే విధిగా తీర్మానంలో పేర్కొనాల్సి ఉంటుంది.

వీడియోగ్రఫీ ముఖ్యం..

Telangana Municipal Corporations : కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు మినహా ఇతరులను ఎవరినీ కౌన్సిల్ సమావేశానికి అనుమతించారదని.. అవసరమనిపిస్తే మేయర్, ఛైర్​పర్సన్ లేదా వారి అనుమతితో ఇతరులు కౌన్సిల్ తీర్మానాలను మీడియాకు వివరించవచ్చని పురపాలక శాఖ.. ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సిల్ తీర్మానాలు, నిర్ణయాలను విధిగా రికార్డు చేసి మూడు రోజుల్లోపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్​తో పాటు పురపాలకశాఖ ప్రాంతీయ సంచాలకులకు పంపాలని.. ప్రతి కౌన్సిల్ సమావేశాన్ని విధిగా వీడియోగ్రఫీ చేయించి రికార్డు భద్రపరచాల్సి ఉంటుందని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.