ETV Bharat / city

మున్సిపల్ కమిషనర్లకు ఇకపై కలెక్టర్లు సెలవులిస్తారు! - తెలంగాణ మున్సిపల్ చట్టం

మున్సిపల్ కమిషనర్లకు సాధారణ సెలవు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పురపాలకచట్టం ప్రకారం మున్సిపల్ కమిషనర్లు సాధారణ సెలువులు తీసుకోవాలంటే కలెక్టర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

telangana logo
telangana logo
author img

By

Published : Feb 18, 2020, 11:39 AM IST

Updated : Feb 19, 2020, 9:46 PM IST

మున్సిపల్ కమిషనర్లు ఇక నుంచి సాధారణ సెలవు తీసుకోవాలంటే కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. పురపాలక చట్టం 2019లో పొందుపర్చిన నిబంధనల ప్రకారం సాధారణ సెలవు కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని ఉందని తెలిపారు.

సెలవు తీసుకున్న సమాచారాన్ని మెయిల్ ద్వారా సీడీఎంఏ కార్యాలయానికి, ఆర్డీలకు ఇవ్వాలని చెప్పారు. సెలవు దరఖాస్తులకు సంబంధించి ఎలక్ట్రానిక్ విధానం తప్ప ముద్రణాప్రతులను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: నేడు రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు

Last Updated : Feb 19, 2020, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.