ETV Bharat / city

మానవహక్కుల ఉల్లంఘనను తిప్పికొట్టాలి: జస్టిస్ ఎన్‌.వి.రమణ - Justice NV Ramana Latest News

దామోదరం సంజీవయ్య జీవితం నుంచి అందరూ చాలా నేర్చుకోవాలని జస్టిస్ ఎన్‌.వి.రమణ సూచించారు. నిజాయతీగా ఉండటమే సంజీవయ్యను సీఎం చేసిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రిక్షాపై వచ్చిన సీఎం ఆయనేనని వ్యాఖ్యానించారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన వర్చువల్​గా పాల్గొన్నారు.రాజ్యం లేదా సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితుల పక్షాన యువ న్యాయవాదులు నిలబడి, చట్టపరంగా ఆ చర్యలను బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

much-should-be-learned-from-the-life-of-damodaram-sanjeevaiah-justice-nv-ramana
జస్టిస్ ఎన్‌.వి.రమణ
author img

By

Published : Apr 4, 2021, 11:52 PM IST

Updated : Apr 5, 2021, 6:51 AM IST

రాజ్యం లేదా సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితుల పక్షాన యువ న్యాయవాదులు నిలబడి, చట్టపరంగా ఆ చర్యలను బలంగా తిప్పికొట్టాలని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపునిచ్చారు. ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించటంతో పాటు అవసరమైనప్పుడు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఇవన్నీ బరువైన బాధ్యతలే అయినా.. వాటిని యువ న్యాయవాదులు సమర్థంగా మోయగలరని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజం మాట్లాడాల్సిన సందర్భంలో మౌనంగా ఉండటం పిరికితనమేనన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యల్ని గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మార్పు మార్గనిర్దేశకులుగా యువతపై ఎంతో బాధ్యత ఉందని, మాట్లాడలేని వారి తరఫున గళం వినిపించాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న నైపుణ్యాల్ని చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) పరిరక్షణ కోసం వినియోగించాలన్నారు.

జస్టిస్ ఎన్‌.వి.రమణ

విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 4, 5, 6, 7వ స్నాతకోత్సవాలు వర్చువల్‌ విధానంలో ఆదివారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి స్నాతకోత్సవాన్ని నిర్వహించి పట్టభద్రుల వివరాల్ని ప్రకటించారు. ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.సూర్యప్రకాశ్‌, రిజిస్ట్రార్‌ ఇన్‌ఛార్జి కె.మధుసూదనరావు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్నాతకోపన్యాసం చేస్తూ.. సమాజానికి తిరిగివ్వడం నాగరిక పౌరుడి లక్షణమన్నారు. యువ న్యాయవాదులు తాము ఎదిగి వచ్చిన సమాజాన్ని, తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశాన్ని వెనుదిరిగి చూడాలని సూచించారు. మన సంస్కృతి, గొప్ప తత్వవేత్తల విజ్ఞానం, కాలపరీక్షకు నిలబడిన విలువల ఆధారంగా ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఆయన ప్రసంగంలోని ప్రధానాంశాలివీ..

పెండింగ్‌ కేసులకు నాసిరకం న్యాయవిద్య కూడా ఓ కారణం

దేశవ్యాప్తంగా 1,500కు పైగా న్యాయ కళాశాలలు ఉన్నాయి. వాటి నుంచి లక్షన్నర మంది పట్టభద్రులు వస్తున్నారు. ధనవంతులకే న్యాయవాద వృత్తి పరిమితమన్న భావన తప్పని ఈ సంఖ్య నిరూపిస్తోంది. న్యాయవిద్య అవకాశాలు పెరగటంతో అన్ని వర్గాలవారూ ఈ వృత్తిలోకి వస్తున్నారు. అయితే కళాశాలల నుంచి బయటకొస్తున్న పట్టభద్రుల్లో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నవారు 25% కంటే తక్కువే. దేశంలో నాణ్యతలేని న్యాయ కళాశాలలు పెద్దసంఖ్యలో ఉండటం ఆందోళనకరం. ఇది న్యాయవ్యవస్థ దృష్టిలో ఉంది. దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసిరకం న్యాయవిద్య వల్ల దేశంలో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో న్యాయవాదులున్నా.. 3.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే 130 కోట్ల దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ పెండింగ్‌ కేసుల సంఖ్యను చూడాలి. పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గించటంలో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలి. ప్రారంభదశలోనే వివాదాల్ని పరిష్కరించుకునేలా కక్షిదారులకు సలహాలు ఇవ్వాలి.

ఒత్తిడి, క్లిష్ట పరిస్థితుల మధ్య పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
న్యాయ రంగంలో ఉన్నవారు ఒత్తిడి, క్లిష్ట పరిస్థితుల మధ్య పనిచేయడానికి, నిరంతరం కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలి. అంకితభావంతో పనిచేసేవారే ఈ రంగంలో అత్యున్నత స్థితికి చేరుకోగలరు. న్యాయ విద్యార్థులకు అనుభవపూర్వక విజ్ఞానం కూడా ఎంతో అవసరం. లోక్‌అదాలత్‌, న్యాయసహాయ కేంద్రాలు, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో పనిచేసే అవకాశాన్ని న్యాయ విద్యాసంస్థలు విద్యార్థులకు కల్పించాలి. అప్పుడే న్యాయం అందించే వ్యవస్థ (జస్టిస్‌ డెలివరీ సిస్టమ్‌)తో దగ్గరగా పనిచేసే వీలు వారికి కలుగుతుంది.

మా కుటుంబంలో తొలితరం పట్టభద్రుణ్ని

మీలోని చాలామందిలాగే మా కుటుంబం నుంచి వచ్చిన తొలితరం పట్టభద్రుణ్ని నేను. నాది గ్రామీణ నేపథ్యం. మా రోజుల్లో చదువుకునేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో మనసులో మెదులుతోంది. ఆ రోజులతో పోల్చుకుంటే.. మీరు ఎంతో అదృష్టవంతులు. నేర్చుకొనేందుకు అపారమైన వనరులు, సదుపాయాలు, ప్రపంచవ్యాప్త సమాచారాన్ని పొందే వీలు మీకు ఉంది. మీకున్న విజ్ఞానం, ఉత్సుకత, సరికొత్త ఆలోచనలతో ప్రస్తుతమున్న పద్ధతులు, వ్యవస్థలు, సమాజంలో అభివృద్ధి దిశగా ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు. దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేలా, పాల్గొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యా సంస్థలపై ఉంది. విద్య ప్రధాన లక్ష్యాల్లో ఇదొకటి. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం, వారిలో సామాజిక స్పృహ, బాధ్యత పెంచేందుకు తగిన సన్నద్ధత లేదు. మనమందరం కలిసికట్టుగా విద్యా వ్యవస్థ పునరుత్తేజానికి పనిచేయాలి.

న్యాయ పట్టభద్రులు సామాజిక ఇంజినీర్లుగా ఉండాలి

న్యాయ పట్టభద్రుల్ని సామాజిక అవగాహన, విషయ పరిజ్ఞానం కలిగి ఉండేలా తీర్చిదిద్దటం న్యాయ కళాశాలల ప్రధాన లక్ష్యం. న్యాయంతోనే సామాజిక మార్పు సాధ్యం. అందుకే న్యాయవిద్య పట్టభద్రులు తప్పనిసరిగా సామాజిక ఇంజినీర్లుగా ఉండాలి. విశ్లేషణ నైపుణ్యాలు, విమర్శనాత్మక మదింపు, న్యాయపరమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కలిగి ఉండాలి. న్యాయ విద్యార్థులు.. తాము చెప్పే విషయాన్ని కచ్చితంగా, లోపరహితంగా, ప్రభావవంతంగా చెప్పగలగాలి. మీరంతా రేపటి తరం న్యాయవాదులు, న్యాయమూర్తులు. న్యాయాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం కష్టపడి పనిచేయాలి. వర్తమాన పరిస్థితుల్లో సమాజంలో ఎదురవుతున్న సవాళ్ల పట్ల అవగాహన కలిగి ఉండాలి.

దామోదరం సంజీవయ్యది విలువలతో కూడిన జీవితం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర కార్మికశాఖ మాజీ మంత్రి దామోదరం సంజీవయ్య శతజయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని ప్రసంగించటం ఆనందంగా ఉంది. ఆయన పేరిటే ఈ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. విలువలతో కూడిన జీవితం, ప్రజాసేవ ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అలాంటి వారు ఎవరూ లేరు. ఆయన అసలు సిసలైన ఆణిముత్యం. ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే ఓ వృత్తాంతం మీకు చెప్పాలి. సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ భావించారు. ఆ నిర్ణయాన్ని చాలామంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన అవినీతిపరుడని, లక్షల రూపాయలు సంపాదించారని నెహ్రూకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపించారు. దీంతో రహస్య విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నెహ్రూ తన స్నేహితుణ్ని కోరారు. ఆ దిల్లీ నాయకుడు స్థానిక నాయకుడితో కలిసి సంజీవయ్య స్వగ్రామానికి వెళ్లారు. ఊరి శివారులో ఓ పూరిగుడిసె ముందు కారు ఆపారు. అక్కడ ఓ కట్టెలపొయ్యిపై మట్టికుండలో వంటచేస్తూ ఓ మహిళ కనిపించింది. ఆమె సంజీవయ్య మాతృమూర్తి. దిల్లీ నుంచి వచ్చిన పెద్దమనిషి ఆమెతో మాట్లాడుతూ.. మీ కుమారుణ్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలనుకుంటున్నారని ఆమెతో చెప్పగా, ఆమె ఆనందపడుతూ... అయితే తన కుమారుడు బొగ్గుల పొయ్యి కొనగలడా? అని ప్రశ్నించారు. ఈ వయసులో కట్టెల పొయ్యిపై వండటం కష్టంగా ఉందని ఆమె వివరించారు. ఆమె మాటలు విన్న దిల్లీ నాయకుడికి నోటమాట రాలేదు. తదుపరి విచారణ అవసరం లేదని తనతో వచ్చిన స్థానిక నాయకుడితో పేర్కొంటూ వెనక్కి వెళ్లిపోయారు. సరిగ్గా వారం రోజుల తర్వాత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అసెంబ్లీకి రిక్షాలో వెళ్లేవారు. నిజాయతీ, నిస్వార్థ నాయకత్వానికి ఆయన నిదర్శనం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీని ఏర్పాటు చేశారు. పారదర్శకత, అవినీతి రహిత పాలన కోసం ఎంతో పాటుపడ్డారు. గుండెపోటుతో ఆయన చనిపోయే నాటికి ఆయన వద్ద మిగిలిన ఆస్తులు మూడే. అవి ఆయన దుస్తులు, పళ్లెం, ఒక గ్లాసు!!

మల్లన్న సేవలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ...

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆదివారం శ్రీశైలం వచ్చారు. స్థానిక నందినీకేతన్‌ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఖాజా మొహిద్దీన్‌, జిల్లా జడ్జి డాక్టర్‌ రాధాకృష్ణ కృపాసాగర్‌, దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆత్మకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజన్‌ ఉదయ్‌ ప్రకాశ్‌ సాదర స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తి వెంట డీఎస్పీ శ్రుతి, స్థానిక తహసీల్దారు రాజేంద్రసింగ్‌ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: 'సాగర్​ పోరు': హోరెత్తిన ప్రచారం.. మండుటెండలోనూ ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు

Last Updated : Apr 5, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.