YSRCP Rajya Sabha Members : ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభులు. జూన్ 21తో వీరి పదవీకాలం ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది.
అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు..
Rajya Sabha MPs from AP : విజయసాయిరెడ్డి వైకాపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంతో పాటు మిగిలిన మూడు కూడా వైకాపాకే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ వైకాపాలో ఉంది. మిగిలిన మూడు స్థానాల్లో రెండు తమ సొంత పార్టీ నేతలకు, ఒకటి ఉత్తర భారతదేశానికి చెందిన కార్పొరేట్ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు పార్టీ నేతల్లో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు, మరొకరు గుంటూరు జిల్లాలో మూడేళ్ల నుంచి ఏ అవకాశమూ దక్కని సీనియర్ నేత అని వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడిని గత వారం ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్యసభకు పంపే అవకాశంపై చర్చ జరిగినట్లు సమాచారం తెలిసింది. బీద మస్తాన్‌రావుకు బీసీ కోటాలో అవకాశం ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాల్లో ఒకటి ఎస్సీ లేదా మైనారిటీకి ఇవ్వవచ్చన్న వాదన కూడా వైకాపా వర్గాల్లో ఉంది. అయితే.. నలుగురు అభ్యర్థుల తుది వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.
- ఇదీ చదవండి : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. భారీగా మరణాలు నమోదు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!