ETV Bharat / city

'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి' - mp revanth reddy wrote letter to cm kcr for journalsits

జర్నలిస్టుల సమస్యలు, భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు భద్రత, సహకారం అందించాలని కేసీఆర్​కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రజా స్వామ్యంలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

mp revanth reddy wrote open letter to cm k chandrasekhar rao on journalist problems
సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఎంపీ రేవంత్​ రెడ్డి
author img

By

Published : Jun 10, 2020, 8:03 PM IST

Updated : Jun 10, 2020, 8:25 PM IST

ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాలని పేర్కొంటూ... ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రతి పాత్రికేయునికి ఉచితంగా కరోనా పరీక్షల నిర్వహించాలని కోరారు. ప్రతి కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

కొవిడ్​-19 కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా ఉండి, సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. చాలీచాలని జీతాలు, అర్ధాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం అందించడం కోసం మీడియా ప్రతినిధులు నిరంతరం పని చేస్తున్నారని వారి సేవలను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువ విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మరణించటంతో అనేక మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: చర్చలు సఫలం.. ఆ ఐదు డిమాండ్లకు మంత్రి సానుకూలం

Last Updated : Jun 10, 2020, 8:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.