ETV Bharat / city

ఆరోపణలు వస్తే స్టేలు తెచ్చుకోవడం ఏంటి?

author img

By

Published : Jun 12, 2020, 5:44 AM IST

మంత్రి కేటీఆర్​పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. . అధికారులపై కేటీఆర్ ఒత్తిడి ఉందని, అందుకే స్టే వద్దని వాళ్లు కోర్టులో వాదించలేకపోయారని ఆరోపించారు. ఆరోపణలు వస్తే స్టేలు తెచ్చుకోవడం ఏమిటని, విచారణ ఎదుర్కోవాలి అని గతంలో కేటీఆర్ సూక్తులు చెప్పాడని ఎద్దేవా చేశారు. నీతులు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏ మొహంతో స్టే తెచ్చుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆరోపణలు వస్తే స్టేలు తెచ్చుకోవడం ఏంటి?
ఆరోపణలు వస్తే స్టేలు తెచ్చుకోవడం ఏంటి?

గాంధీలో వైద్యులకు సంఘీభావం తెలపకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అక్రమ ఫాంహౌస్​పై కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని తెలిపిన రేవంత్​ స్టే అన్నది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనన్నారు. నార్సింగ్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో సమర్పించిన మెమోను నిన్న కోర్టుకు సమర్పించి ఉంటే స్టే కూడా వచ్చేది కాదన్నారు. అధికారులపై కేటీఆర్ ఒత్తిడి ఉందని, అందుకే స్టే వద్దని వాళ్లు కోర్టులో వాదించలేకపోయారని ఆరోపించారు.

చెప్పిన సూక్తులు మరిచావా..?

కేటీఆర్ మంత్రిగా ఉంటే విచారణ సాగదన్న తమ అనుమానం నిన్న కోర్టులో నిజమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫాంహౌస్ కట్టి ఐదేళ్లైంది కనుక ఎన్జీటీ పరిధిలోకి రాదన్న కేటీఆర్ వాదన సాంకేతికమైనది మాత్రమేనని తెలిపారు. తాను రాజకీయ ప్రత్యర్థిని అని చెప్పి ఆ ముసుగులో కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలు వస్తే స్టేలు తెచ్చుకోవడం ఏమిటని, విచారణ ఎదుర్కోవాలి అని గతంలో కేటీఆర్ సూక్తులు చెప్పాడని ఎద్దేవా చేశారు.

దోషిగా నిలబెడతా..

తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడండి అని కూడా నీతులు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏ మొహంతో స్టే తెచ్చుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్​కు ఫాంహౌస్ ఉందా? లేదా?. లీజుకు తీసుకున్నాడా? అది అక్రమ కట్టడం అవునా? కాదా? సమాజానికి చెప్పాలన్నారు. ఏ న్యాయస్థానం నుంచి కేటీఆర్ స్టే తెచ్చుకున్నారో అదే న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి కేటీఆర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: నూతన పురపాలక చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.