తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ... రేవంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సచివాలయం కూల్చివేతతో ప్రజధనాన్ని వృథా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించి కొట్టివేసింది.