ఇప్పుడు జరుగుతున్నవి ప్రధాని, ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు కావు... బస్తీలో గస్తీ కాసే కార్పొరేటర్ ఎన్నికలు అని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబర్పేట డివిజన్లో పటేల్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ అభ్యర్థి పీర్ మునీర్ జాబిర్ తరఫున... సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి ప్రచారం నిర్వహించారు. కరోనా, వరదల సమయంలో నాయకులంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు గల్లీ నుంచి దిల్లీ వరకు నాయకులంతా వస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెరాస, భాజపా, ఎంఐఎం ఒక్కటేనని... కాంగ్రెస్ను ఓడించడానికి మజ్లిస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుందని ఆరోపించారు. ఎంఐఎం, భాజపా గల్లీలో పంచాయితీ చేసుకుంటూ... దిల్లీలో స్నేహం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టే హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని... ఎవరూ మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: నీచ రాజకీయాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రేవంత్ రెడ్డి