ETV Bharat / city

MP RAGHURAMA: 'చిరంజీవి, పవన్‌ కన్నా నాకే ఫాలోయింగ్ ఎక్కువనుకుంటా' - ఏపీ న్యూస్ అప్​డేట్స్

చిరంజీవి, పవన్ కల్యాణ్ కన్నా తనకే ప్రజాదరణ ఎక్కువేమోనని ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అందుకే మీడియా సంస్థలు వారిని మించి పారితోషికం ఇచ్చి తన ప్రసంగాలు ప్రసారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

mp-rahurama-krishna-comments-on-ap-government
'చిరంజీవి, పవన్‌ కన్నా నాకే ఫాలోయింగ్ ఎక్కువనుకుంటా'
author img

By

Published : Jul 20, 2021, 8:56 AM IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపన్ని ఓ మీడియా సంస్థ నుంచి తాను మిలియన్‌ యూరోలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. డబ్బుల బదిలీల అలవాటున్న వారు యూరోల్లో బదిలీ చేశారేమో, అందుకే ఆ పదప్రయోగాన్ని ఇక్కడ వాడినట్లు ఉందని పేర్కొన్నారు.

‘‘ఇప్పటివరకు మీడియాలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నాం. కానీ వారి కంటే నాకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు, అందుకే నాకు ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో నాపై అఫిడవిట్‌ వేసింది. అందులో నాకు ఒక మిలియన్‌ యూరోలు అందినట్లు పేర్కొంది. వారి డబ్బులు యూరోల్లో బదిలీ అయ్యాయేమో నాకు తెలియదు. సాధారణంగా మీడియాలో చాలా మంది.. అడిగి మరీ వార్తలు వేయించుకుంటుంటారు. కానీ నాకే ఎదురుడబ్బు ఇచ్చి నా ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇంకా ఎన్నెన్ని మాట్లాడుతారో, ఎందుకు ఇలా దిగజారి మాట్లాడుతున్నారన్నది నాకు తెలియదు.

ఇక్కడితో ఆగకుండా, నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు కొత్త వదంతి సృష్టించారు. నా రాజీనామా అన్న ప్రసక్తే లేదు. నా సభ్యత్వం రద్దు అన్నది కల్ల. నేను షెడ్యూల్‌ 10 లోని నిబంధనలను ఉల్లంఘించలేదు. వాళ్లు మోపిన అభియోగాలన్నీ అర్థం పర్థం లేనివే. లోక్‌సభ స్పీకర్‌కు దీనిపై వివరణ ఇస్తాను. మా ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో ఉన్నారు. రాజ్యసభలో ప్రధానమంత్రి ఉన్నప్పుడే సభలో దురుసుగా ముందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రజాసమస్యల గురించి మాట్లాడకుండా నన్ను అనర్హుడిని చేయడం కోసం ఇలా గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. దానికి ప్రత్యేకహోదా, పోలవరం నిధుల ముసుగు వేస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకొని చేసే చేష్టలను సంగ్రహించే తెలివితేటలు అందరికీ ఉంటాయన్నది మా వాళ్లు గ్రహించాలి.- ఎంపీ రఘురామ కృష్ణరాజు

సులభంగా విలువలను వలిచేస్తున్నారు

నా అనర్హతపై సంధి ప్రేలాపనలు పేలుతున్న విజయసాయిరెడ్డి జనసేనలో నెగ్గిన రాపాక వరప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపేసుకున్నారు? గురువింద గింజ తన నలుపును గుర్తించలేనట్లు నలుగురు ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకొని, వారి సొంత పార్టీ నేతలను అక్కడ అనరాని మాటలు అనిపిస్తున్నారు. ఇక్కడ లోక్‌సభ స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇది మానవమాత్రుల వల్ల అయ్యే పనికాదు. అలా మాట్లాడగలగడం ఒక కళ. మాట్లాడితే విలువల గురించి చెప్పే వారు వలువల కంటే సులభంగా విలువలను వలిచేస్తున్నారు. ఇప్పుడు వారి మాటలు వింటే బాధ అనిపిస్తుంది. శ్రీరంగనీతులు చెబుతూ మరేదో పనిచేసే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించే స్పీకర్‌ ఓం బిర్లాను దుర్భాషలాడటం చాలా అన్యాయం. నన్నేదైనా అనండి తప్పితే రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌, ప్రధానమంత్రులపై నోరు పారేసుకోవద్దు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందు మంత్రులు సామంతులు కావడం దారుణం...’’ - ఎంపీ రఘురామ కృష్ణరాజు

పొలం ఒక కులానికి... పుట్ర అందరికీ.. అన్నట్లుగా కార్పొరేషన్‌ పదవుల పంపిణీ

జాబ్‌ క్యాలెండర్‌ కోసం ప్రజలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తున్నారు. మేం జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకపోయినా 3 లక్షల వాలంటీర్‌ పోస్టులు, ఉన్నవి.. లేనివి కలిపి వందల కొద్దీ కార్పొరేషన్‌ పోస్టులు ఇచ్చాం. మానవ మాత్రులెవ్వరూ గుర్తుపెట్టుకోలేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పనులు కట్టబెట్టారు. దేవత సినిమాలో మోహన్‌బాబు ఆస్తి నాకు... పాస్తి నీకు, పొలం నాకు... పుట్ర నీకు అన్నట్లు పెద్దపెద్ద కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులన్నీ ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారు. కులాల మధ్య అంతరాలు తొలగించాల్సిన ప్రభుత్వం కులాలను ఉపకులాలుగా విభజించి ఛైర్మన్లు చేసి లేనిపోని అంతరాలను సృష్టిస్తోంది. కులాల కార్పొరేషన్లు మినహాయించి మిగిలిన ముఖ్యమైనవన్నీ ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారు. పదవుల పంపకాన్ని చదివినప్పుడు మాత్రం సామాజిక న్యాయం చక్కగా పాటించారు. అందువల్ల మున్ముందు అందరికీ ఇలాంటి పదవులు ఇస్తారు కాబట్టి జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదని మా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించొద్దు.- ఎంపీ రఘురామ కృష్ణరాజు

ఇదీ చదవండి: Huzurabad By Election: సర్వత్రా ఉత్కంఠ.. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.