ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్కు నోటీసులు పంపించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు తన దగ్గర తీసుకున్న వస్తువులు.. మెజిస్టేట్ వద్ద జమచేయాలన్నారు. అరెస్టు సమయంలో ఇంటి నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లారన్నారు. తన ఫోన్లో విలువైన సమాచారం ఉందని.. నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర అంశాలతో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాలని కస్టడీలో హింసించినట్లు నోటీసుల్లో రఘురామ తెలిపారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా