ETV Bharat / city

MP RaghuRama: స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ - mp raghurama krishnaraju wrote letter to Lok Sabha Speaker Om Birla

లోక్​సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు. భేటీకి ముందే స్పీకర్​కు రఘురామ లేఖ రాశారు.

raghurama
స్పీకర్‌ ఓంబిర్లా
author img

By

Published : Jun 14, 2021, 10:48 PM IST

లోక్​సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు. భేటీకి ముందే స్పీకర్​కు రఘురామ లేఖ రాశారు. అనర్హత వేటుపై వైకాపా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవద్దని ప్రస్తావించారు. ప్రభుత్వ తప్పులు ప్రస్తావించకుండా తన గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.

ఏం జరిగిందంటే...

రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాకు లోక్​సభలో వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. రఘురామకృష్ణరాజు... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్​సభ స్పీకర్​కు​ సమర్పించామన్నారు. అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్​కు​ సంబంధించి స్పీకర్​ను​ కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్​క్వాలిఫై చేయాల్సిందిగా లోక్​సభ స్పీకర్​ను​ కలిసి భరత్ విజ్ఞప్తి చేశారు.

వెబ్ సైట్ నుంచి రఘురామ పేరు తొలగింపు...

వైకాపా అధికారిక వెబ్​సైట్​లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరును తొలగించారు. రాజ్యసభ, లోక్​సభకు కలిపి ఆ పార్టీ తరపున 28 మంది ఎంపీల పేర్లు గతంలోని వెబ్​సైట్​లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే ఎన్నికైన గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరు ఇప్పుడు జాబితాలో లేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ అంశంతో పాటు వైకాపా ఫిర్యాదును ఎంపీ రఘురామ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: మంత్రి జగదీశ్​రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రేవంత్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.