ETV Bharat / city

RRR: రాజీనామా వార్తల్లో నిజం లేదు: రఘురామకృష్ణరాజు

తన ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. రాజీనామా అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన సభ్యత్వం ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

RRR
ఎంపీ ​రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jul 19, 2021, 6:04 PM IST

కొందరు ప్రచారం చేసినట్లు ఎంపీ పదవికి తాను రాజీనామా చేయలేదని ఏపీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఎవరెన్ని మాట్లాడినా.. లోక్​సభ సభ్యత్వం వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన సహచర వైకాపా ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై లేవనెత్తకుండా.. ఎవరో భయపెట్టినట్లు బెరుకుగా కనిపించారని వ్యాఖ్యానించారు.

నా లోక్​సభ సభ్యత్వం రద్దవ్వటం కళ్లా.. నేను నిబంధనలను అతిక్రమించలేదు. నాపై మోపిన అభియోగాలన్నీ అర్థంలేనివి. లోక్​సభ​ స్పీకర్​ను కలిసి వివరణ ఇస్తాను. మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శిగారు అసహనంతో ఉన్నారనేది సుస్పష్టం. ఇవాళ సభలో ప్రధాని మోదీగారు ఉండగానే చాలా దురుసుగా మాట్లాడారు. మా సహచర ఎంపీలను బెదిరించినట్లుగా కనిపిస్తోంది.- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ

ఇదీ చదవండి

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.