పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల సవరణ బిల్లుకు తెరాస లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు మద్దతిచ్చారు. జీవితంలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులను కరోనా వేళ దేశ ప్రజలు ఎదుర్కొన్నారని నామ తెలిపారు. ఇటువంటి సమయంలో తమ జీతంలో 30 శాతం కోత విధించటంపై అభ్యంతరమేమి లేదన్న ఎంపీ... ఆ మొత్తాన్ని పేదలకు ఖర్చు చేయాలని సూచించారు.
కరోనా నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ మొత్తాన్ని ఆసుపత్రుల అభివృద్ధికి ఖర్చు చేయాలని లోక్‌సభ సభ్యులంతా కలిసి నిర్ణయించుకున్నట్లు నామ తెలిపారు. కేంద్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే రెండేళ్లకు ఎంపీ నిధుల కోత విధించటంపై పునరాలోచించాలని కోరారు.