ETV Bharat / city

AP Theatres: సినీ ప్రియులకు శుభవార్త.. థియేటర్లు తెరిచేందుకు అనుమతి - సినిమా థియేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో జులై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది.

AP Theatres open
ఏపీలో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి
author img

By

Published : Jul 29, 2021, 6:59 PM IST

తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జులై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ జులై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా సాధ్యం కాలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. శానిటైజర్లు, సామాజిక దూరం, మాస్కులు వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే, 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నడపటం తమకు నష్టమని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రభుత్వం గతంలోనే పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడిపించుకోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరచుకోవడంతో ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న చిన్న, పెద్ద సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం సత్యదేవ్‌ నటించిన 'తిమ్మరుసు', తేజ-ప్రియా ప్రకాశ్ వారియర్‌ జంటగా నటించిన 'ఇష్క్‌' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదీ చదవండి:

HC on Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై ఏం నిర్ణయం తీసుకున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.