ETV Bharat / city

Inhumanity: తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా కుమారుల కర్కషత్వం - కన్నతల్లినే ఇంట్లోకి రానివ్వని కొడుకులు

నవమాసాలు మోసి కనిపెంచింది ఆ అమ్మ. అలాంటి తల్లికి వృద్ధాప్యంలో అండగా నిలవాల్సింది పోయి అనాథగా వదిలేశారు. అయినా.. ఆమె చింతించలేదు. పని చేసుకుంటూ జీవనం సాగించింది. ఆరోగ్యం క్షీణించటం వల్ల... కుమారుల ఇంటికి వచ్చింది. ఆ స్థితిలో ఉన్నా కూడా తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా నడిరోడ్డుపైనే ఉంచేశారు ఆ ప్రబుద్ధులు.

inhumanity,inhumanity on mother
inhumanity
author img

By

Published : May 28, 2021, 1:28 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరంలో అమాననీయం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా.. రోడ్డుపైనే ఉంచేశారు ఆ కుమారులు. రోడ్డుపైన ఆటోలోనే 12 గంటలుగా సూర్యకాంతం(80) తలదాచుకుంది.

కొన్నేళ్లుగా ఆకివీడులోని ఓ ఇంట్లో సూర్యకాంతం అద్దెకు ఉంటోంది. గురువారం వడదెబ్బ తగలడం వల్ల ఇంటి యజమాని ఆస్పత్రిలో చూపించారు. చికిత్స తర్వాత ఇంటి యజమాని... ఆమె కుమారులు ఉంటున్న పెదకాపవరానికి పంపించారు. అనారోగ్యంతో ఉన్న తనను కుమారులు ఇంట్లోకి రానివ్వట్లేదని ఆ తల్లి బోరున విలపించింది.

ఇదీ చదవండి:

Fire accident: 3 రోజుల్లో శుభకార్యం.. అంతలోనే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.