రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,80,406 మందికి టీకాలు అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో 1,70,645 మందికి తొలిడోస్ ఇవ్వగా మరో 9,761 మందికి రెండో డోస్ టీకా వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 69,75,367 మందికి మొదటి డోస్, 15,34,371 మందికి రెండు డోసుల టీకాలు పూర్తైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
మొదటి, రెండు డోసులు తీసుకున్న వారు రాష్ట్రంలో 85,09,738 మంది ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 860 కేంద్రాల్లో టీకాలు అందిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు కొవిన్ పోర్టల్ ప్రకారం 76 లక్షల 68,870 టీకా డోసులు రాష్ట్ర ప్రభుత్వానికి అందగా అందులో ఇప్పటికే 75,94,339 డోసులు వినియోగించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటులో 9,15,339 మందికి టీకాలు అందించారు.