ETV Bharat / city

మూసీ మురుగు వదిలింది.. ఊపిరాడుతోంది...

నది అనే ఆనవాళ్లు కోల్పోయి.. మురుగు కాలువలా మారి.. ఊపిరాడనంత దుర్గంధంతో నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన మూసీ.. ఇటీవల భారీ వర్షాలు వరదలతో.. నేనూ నదినే అని నిరూపించుకుంది. పూర్తిస్థాయిలో ప్రవహించి ఏళ్లుగా పేరుకుపోయిన మురుగు, వ్యర్థాలను తొలగించుకుంది.

Moose river got cleansed with heavy floods in Hyderabad
మూసీ మురుగు వదిలింది
author img

By

Published : Nov 6, 2020, 8:52 AM IST

వరదలప్పుడు మూసీ ప్రవాహాన్ని చూడడానికి నగర ప్రజలు ఉత్సుకత చూపించారు. ఎన్ని ప్రభుత్వాలు తలచుకున్నా వదలని దుర్గంధం ఒక్క ప్రవాహంతో కొట్టుకుపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు పరివాహక ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు. నది ప్రక్షాళనకు గతంలో అనేక ప్రాజెక్టులు తెరమీదకొచ్చినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ బాధ్యతలను తీసుకున్న మూసీరివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎంఆర్‌డీసీ) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నదిలో తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసి నయనమనోహరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

పరిశుభ్రంగా ఎంజీబీఎస్‌ పరిసరాలు..

ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్‌ అయిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌) ఊపిరి పీల్చుకుంటోంది. రోజూ 1.20 లక్షల మంది ఇక్కడికి వచ్చి వెళ్లే 3500 బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రాంగణంలో ఉన్నంత వరకూ దుర్వాసనతో ఇబ్బంది పడేవారు. ప్లాస్టిక్‌ సంచులు, పిచ్చి మొక్కలతో మురుగు కంపు భరించలేని విధంగా ఉండే నది ఇటీవల వరదలతో కడిగేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎలాంటి దుర్వాసన రావట్లేదని ప్రయాణికులంటున్నారు. ఇక్కడి మెట్రో జంక్షన్‌ నుంచి రాకపోకలు సాగించే వారికీ దుర్గంధం నుంచి విముక్తి లభించింది.

లంగర్‌హౌస్‌ నుంచి ఉప్పల్‌ వరకూ..

లంగర్‌హౌస్‌ దగ్గర ఈసీ - మూసీ నదుల సంగమం నుంచి ఉప్పల్‌ వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర నగరంలో ప్రయాణిస్తోంది మూసీ నది. ఈ పరీవాహకంలో వేలాది బస్తీలు, వందల కాలనీలున్నాయి. ఆయా బస్తీల్లో 45 వేల మంది వరకూ నివసిస్తున్నారు. ఇటీవల వరదలతో వీరంతా ఇబ్బంది పడినా.. ఇప్పుడు స్వచ్ఛమైన వాతావరణంతో కాస్త సేదదీరుతున్నారు. దశాబ్దాలుగా మురుగు కంపును భరించాం.. ఇప్పుడు పరిశుభ్రమైన నదిని చూస్తున్నాం. ఇలాగే ఉంచేందుకు అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తాజాగా ఎంఆర్‌డీసీ..

మూసీ నదిలోకి వచ్చే మురుగును వంద శాతం పరిశుభ్రం చేసిన తర్వాత వదలాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. స్థానిక పరిపాలనా సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ ఏర్పడింది. 2020 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది.

పురానాపూల్‌ నుంచి చాదర్‌ఘాట్‌ వరకూ 4 కి.మీ. మేర ముందుగా అభివృద్ధి చేసి.. తర్వాత మిగతా ప్రాంతమంతా అలాగే అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.

అందుబాటులోకి వచ్చే మొత్తం 450 ఎకరాల భూమి లో పార్కులు అభివృద్ధి చేయడం, నది చరిత్రను చాటే ఏర్పాటు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరకుండా కరకట్టలు కట్టడం చేయాలి.

1400 మిలియన్‌ లీటర్ల మురుగు రోజూ మూసీలో కలుస్తోంది. ప్రస్తుతం 592 మిలియన్‌ లీటర్లను మాత్రమే శుభ్రం చేసే వ్యవస్థ ఉంది. మరో 10 చోట్ల మురుగు నీటిని శుభ్రం చేసే వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు రూ.1200 కోట్లతో అంచనాలు రూపొందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.