హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పీవీ ఘాట్‌కు వెళ్లిన ఆమె.. మంత్రి తలసాని, కె.కేశవరావుతో కలిసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని వాణీదేవి అన్నారు.
అక్కడి నుంచి వారు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమెకు బీఫామం అందజేశారు. వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోరారు. పీవీకి సరైన గౌరవం దక్కాలంటే వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం