ETV Bharat / city

'భాజపా ఎదుగులదను చూసి ఓర్వలేకనే తెరాస మద్దతు' - కేసీఆర్​ కేటీఆర్​పై ఎమ్మెల్సీ రామచందర్​ రావు విమర్శలు

తెలంగాణలో భాజపా ఎదుగుదలను చూసి ఓర్వలేకనే... ఈ నెల 8న భారత్​ బంద్​కు తెరాస మద్దతిస్తోందని ఎమ్మెల్సీ రామచందర్​ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

'భాజపా ఎదుగులదను చూసి ఓర్వలేకనే భారత్​ బంద్​కు తెరాస మద్దతు'

author img

By

Published : Dec 6, 2020, 10:59 PM IST

ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్‌ బంద్​కు మద్దతిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామచందర్​ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న అందోళన అది కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని ఆక్షేపించారు.

తెరాసను దుబ్బాకలో ప్రజలు ఓడించారని... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తగ్గించడం వల్లనే రైతులకు మద్దతు ఇస్తున్నట్టు నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో భాజపా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఏజెంట్ వ్యవస్థ పూర్తిగా మాయమవుతుందని, దళారీలకు లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ కేంద్రంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి: హస్తినలో రాములమ్మ... భాజపాలో చేరికకు ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.