ETV Bharat / city

నల్గొండ నుంచి హైదరాబాద్​కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర - telangana latest news

ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ... ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 13న నల్గొండ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్​లో కూడా సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.

mlc narsireddy padayathra from nalgonda to hyderabad
నల్గొండ నుంచి హైదరాబాద్​కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర
author img

By

Published : Feb 9, 2021, 5:00 PM IST

ఈ నెల 13 నుంచి 16 వరకు నల్గొండ నుంచి హైదరాబాద్​కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర బడ్జెట్​లో సవరణలు చేయాలన్న డిమాండ్లతో పాదయాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. న్యాయమైన ఫిట్​మెంట్​తో వేతన సవరణ, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, అంతర్​ జిల్లా బదిలీలకు షెడ్యూల్​ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ... ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని నర్సిరెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీల్లో వీసీలు, ఆచార్య, సహాయ ఆచార్య ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, బడ్జెట్​లో విద్య, శిశుసంక్షేమానికి నిధులు పెంచాలన్నారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సీసీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛనును అమలు చేయాలని కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలి: మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.