ETV Bharat / city

ఇదే అభివృద్ధి కొనసాగాలంటే తెరాసకు ఓటేయండి: కవిత - కల్వకుంట్ల కవిత తాజా వార్తలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

mlc kavitha request to ghmc people  to cast their votes for trs
ఇదే అభివృద్ధి కొనసాగాలంటే తెరాసకు ఓటేయ్యాలి: కవిత
author img

By

Published : Nov 18, 2020, 9:13 AM IST

ఇదే అభివృద్ధి కొనసాగాలంటే తెరాసకు ఓటేయ్యాలి: కవిత

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్​కు, ఇప్పటి హైదరాబాద్​కు ఎంతో పురోగతి ఉందన్న కవిత.. భాగ్యనగరం ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత నగర ప్రజలపై ఉందన్నారు.

హైదరాబాద్ నగరం వరుసగా ఐదేళ్లగా భారతదేశంలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావని.. ఎంతో కష్టపడితే మాత్రమే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ మహానగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతిభద్రతలు.. ఇవన్నీ సీఎం కేసీఆర్‌, తెరాస వల్లే ఇంత గొప్పగా ఉన్నాయి. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉంది. ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ.

ఇవీ చూడండి: బస్తీ మే సవాల్​: పట్టునిలుపుకునేనా?.. పాగా వేసేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.