భారతదేశం సంస్కృతి ఉత్కృష్టమైనదని మహ సహస్త్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహరావు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో గీత జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత... గరికపాటి నరసింహారావుకు స్వర్ణ కంకణం ధారణ చేసి పట్టు వస్త్రాలను అందజేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం గరికపాటి నరసింహారావు భగవద్గీత సందేశాన్ని ఇచ్చారు.
సమాజంలో ప్రతి ఒక్కరు నేను నాది అనే భావన విడనాడాల్సిన అవసరం ఉందని గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. సమాజ ప్రయోజనాల కోసం ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదని తాము చేసే ప్రతి పనికి ఆత్మసంతృప్తి ఉండాలని హితబోధ చేశారు. ఎదుటివారిని చూసి ఏడ్చే గుణాన్ని ప్రతీ ఒక్కరు వీడాలని సూచించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. గీతా జయంతి పురస్కరించుకొని గరికపాటి నరసింహారావు, ఎమ్మెల్సీ కవిత కలిసి గోమాతకు పూజ చేశారు.