ETV Bharat / city

రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్: రాజాసింగ్ - mla raja singh on new agriculture act

రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఓ చట్టం తీసుకొస్తే.. మాయమాటలతో ప్రతిపక్షాలు వారిని పక్కదారి పట్టిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. భారత్​ బంద్​కు రాష్ట్ర సర్కార్ మద్దతివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

mla raja singh fires on cm kcr for supporting bharat bandh
నూతన వ్యవసాయ చట్టంపై రాజాసింగ్ వ్యాఖ్యలు
author img

By

Published : Dec 8, 2020, 11:57 AM IST

రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆరేనని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. రైతుల భూములను కబ్జా చేసి వెంచర్లు వేశారని మండిపడ్డారు. దళారుల చేతుల్లో రైతాంగం మోసపోవద్దనే మోదీ నూతన చట్టాలను తీసుకువచ్చారని స్పష్టం చేశారు. ఈ చట్టాలపై రైతులు పూర్తిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు కేంద్రాన్ని, మోదీని లక్ష్యం చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అంటే ఒక వ్యక్తి కాదని.. సమూల శక్తి అని ఎమ్మెల్యే రాజా సింగ్ అభివర్ణించారు.

రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్​ బంద్​కు రాష్ట్ర సర్కార్ మద్దతివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాజా సింగ్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.