ETV Bharat / city

'ఓల్డ్​బోయిన్​పల్లిని గోల్డ్​బోయిన్​పల్లిగా తీర్చిదిద్దటమే లక్ష్యం'

సికింద్రాబాద్​ ఓల్డ్​బోయిన్​పల్లి డివిజన్​ పరిధిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్​ ముద్దం నరసింహయాదవ్​ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. దాదాపు రూ.కోటీ 6 లక్షలతో రోడ్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కార్పొరేటర్​ వెల్లడించారు.

'ఓల్డ్​బోయిన్​పల్లిని గోల్డ్​బోయిన్​పల్లిగా తీర్చిదిద్దటమే లక్ష్యం'
'ఓల్డ్​బోయిన్​పల్లిని గోల్డ్​బోయిన్​పల్లిగా తీర్చిదిద్దటమే లక్ష్యం'
author img

By

Published : Nov 5, 2020, 12:07 PM IST

సికింద్రాబాద్ ఓల్డ్​బోయిన్​పల్లి డివిజన్​ను గోల్డ్ బోయిన్​పల్లిగా తీర్చిదిద్దుతూ... అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. ఓల్డ్​బోయిన్​పల్లి డివిజన్ పరిధిలో కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు​తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వర్షాల మూలంగా దెబ్బతిన్న రోడ్లను పూర్తిగా మరమ్మతులు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపరచడంలో తాము సఫలమయ్యామన్నారు.

దాదాపు రూ.కోటీ 6 లక్షలతో రోడ్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కార్పొరేటర్​ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్దన్ గౌడ్, ఏఈ అరవింద్ రావు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నరేందర్ గౌడ్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబెర్ కర్రే జంగయ్య, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్, కన్సిస్టెన్సీ ప్రెసిడెంట్ ఇజాజ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.