fees in education institutions: రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూలుకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. దీంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఫీజులతో పిల్లలను ప్రైవేట్ పాఠశాల్లో చదివించడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై మంత్రి వర్గ ఉపసంఘం నియమించింది.
మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
విద్యాసంస్థల్లో ఫీజులపై విధి విధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈనెల 21న మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నిబంధనలపై విద్యాశాఖ అధికారులు అధ్యయనం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందించనున్నారు. ఫీజుల నియంత్రణపై కొత్త చట్టాన్ని వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదీ చూడండి: