రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని.. గంగా- జమున తహజీబ్‌కు ఇది నిలువుటద్ధమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అభివర్ణించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో.. దళితుల సంక్షేమంపై ప్రముఖ జర్నలిస్టు వాశీరాజు ప్రకాశం రూపొందించిన 30 నిమిషాల నిడివి గల "మానవతా పరిమళం" అనే డాక్యుమెంటరీని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డాక్యుమెంటరీ రచయిత, డైరెక్టర్ గడ్డం పద్మ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రంలో నివసిస్తున్న అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వారంతా అన్నదమ్ముల్లా ప్రశాంతంగా జీవిస్తున్నారని మంత్రులు తెలిపారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నందున రాజకీయ సుస్థిరత కారణంగా దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు.
"ఉమ్మడి రాష్ట్రంలో మతకలహాలు జరిగేవి. తరచూ శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమై అశాంతి, భయానక వాతావరణం నెలకొనేది. స్వరాష్ట్ర సాధన అనంతరం ఇప్పుడు ఎలాంటి మత, కుల ఘర్షణలు లేవు. అంతా అన్నదమ్ముల మాదిరిగా సుఖ సంతోషాలతో ముందుకు సాగుతున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా పురోగమిస్తోంది. 80 ఏళ్ల వయసులో ప్రజలలో చైతన్యం పాదుగొల్పేందుకు ప్రకాశం.. మానవతా పరిమళం డాక్యుమెంటరీని రూపొందించడం ప్రశంసనీయం." -కొప్పుల ఈశ్వర్, మంత్రి
"అన్నీ వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు చాలా బాగున్నాయి. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. ప్రకాశం 40ఏళ్ల కిందటే "కాలం మారింది"అనే డాక్యుమెంటరీ తీసి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు తీసిన "మానవతా పరిమళం" తెలుగులోనే కాక పలు భారతీయ భాషల్లో విడుదలై, విజయవంతమవుతుంది." - మహమూద్ అలీ, హోం మంత్రి
ఇవీ చూడండి: