ETV Bharat / city

రాజకీయ దుమారం.. పవన్ వ్యాఖ్యలపై మంత్రుల ఫైర్ - kodali nani counter to pawan kalyan

కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. వకీల్ సాబ్ వచ్చాడని.. సీఎం సాబ్​కు చెప్పాలంటూ ఘాటుగా మాట్లాడిన జనసేనానిపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్యాకేజీలు తీసుకుని మాట్లాడే పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని స్పష్టం చేశారు.

pavan
pavan
author img

By

Published : Dec 29, 2020, 9:22 PM IST

కృష్ణా జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు పరిహారంపై గతంలో ఏనాడు ఒక్కమాట మాట్లాడని పవన్... ఇవాళ మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమా జీవితంలోనే వకీల్ సాబ్​ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని.. ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేవలం తన సినిమా ప్రమోషన్ల కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమాలు ఆపేయాలని తాము ఏనాడు అనలేదని స్పష్టం చేశారు.

నోరు అదుపులో పెట్టుకో: కొడాలి నాని

కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం గుడివాడ సెంటర్​లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పేకాట క్లబులు, రోడ్లు, రైతుల కష్టాలను ప్రధానంగా లెవనెత్తారు. పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేను విమర్శిస్తూ ప్రసంగించారు. జనసేనాని చేసిన పలు వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్​లో జవాబిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేకాట క్లబ్బులను మూయిస్తుందే తప్ప.. ప్రోత్సహించటం లేదన్నారు. మంత్రిగా, రాష్ట్ర ప్రజలకు.. ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్తానే తప్ప.. ఎవరో చేసిన ఆరోపణలు పట్టించుకోనని అన్నారు. ఎవరో ప్యాకేజీలిస్తే పర్యటనలు చేయడం కాదని దుయ్యబట్టారు. నోరు అదుపులో ఉంచుకోవాలని తమకు చెప్పటం కాదని... అతనే నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

మంత్రి కొడాలి నాని

నకిలీ వకీల్ సాబ్.. మోదీ సాబ్​కి చెప్పు: పేర్నినాని

పవన్ కల్యాణ్​పై మరో మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంపై మాట్లాడుతున్న పవన్ ముందుగా... మోదీ సాబ్​తో మాట్లాడి కౌలు రైతులందరికీ రైతు భరోసా ఇప్పించేలా చూడాలని సూచించారు. పరిహారం పెంచాలని గత ప్రభుత్వంలో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ ప్రభుత్వమే డబ్బులు కట్టిందనే సంగతి పవన్ తెలుసుకోవాలన్నారు. సినిమాలు ఆపేయాలని పవన్ కల్యాణ్​ను తాము కోరలేదని స్పష్టం చేశారు.

జగన్ వద్ద తాను చిడతలు కొడుతున్నానని మచిలీపట్నంలో పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. తాను వైఎస్ కుటుంబానికి విధేయుడినని.. బతికి ఉన్నంత వరకూ చిడతలు, భజన చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్​లాగా తాము డబ్బుల కోసం చిడతలు కొట్టం అని దుయ్యబట్టారు. పవన్ బెదిరింపులకు వైకాపా జెండా మోసే ఏ ఒక్క కార్యకర్త కూడా పవన్​ను లెక్కచేయరన్నారు. చంద్రబాబుతో జట్టు కట్టడమే కాకుండా.. కమ్యూనిస్టులతో కలిసి వారిని కూడా పక్కన పెట్టేశారన్నారు. ఇప్పుడేమో ప్రధాని మోదీని పొగిడేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్... గుడివాడలో కొడాలి నాని పేరెత్త లేకపోయారని వ్యాఖ్యానించారు. కొడాలి నాని అంటే పవన్​కు అంత భయం ఎందుకని ప్రశ్నించారు.

మంత్రి పేర్ని నాని

డైలాగ్​లు వద్దు...జాగ్రత్త: మంత్రి వెల్లంపల్లి

సినిమా జీవితంలోనే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకుని మాట్లాడే పవన్... గత ఐదేళ్లు తెదేపాకు అనుకూలంగా పని చేశారని దుయ్యబట్టారు. 'చంద్రబాబు మాట - పవన్ నోట' అన్నట్లు ఆయన వ్యవహారం ఉందన్నారు. ఉద్యమిస్తాం, ముట్టడిస్తామంటూ సినిమా డైలాగ్​లు చెప్పడం కాదని... ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా అనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

మంత్రి వెల్లంపల్లి

ఏపీ మంత్రులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సినిమాల ప్రమోషన్ కోసమే పవన్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు పరిహారం అందిస్తుందని తెలిసి రెండు రోజుల ముందు పర్యటనల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి నేతలతో చెప్పించుకునే స్థితిలో సీఎం జగన్ లేరని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.