ETV Bharat / city

'చేపపిల్లల పంపిణీలో మత్స్యకారుల భాగస్వామ్యం తప్పనిసరి' - 'చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాల్సిందే'

ఈ ఏడాది 80.57 కోట్ల చేపపిల్లల్ని చెరువుల్లో విడిచిపెట్టే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు మంత్రి తలసాని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన మంత్రి.. చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో రాజీ పడొద్దని సూచించారు.

'చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాల్సిందే'
author img

By

Published : Sep 19, 2019, 10:54 PM IST

'చేపపిల్లల పంపిణీలో మత్స్యకారులను భాగస్వామ్యం చేయాల్సిందే'

ఈనెల 30వ తేదీ నాటికి చేపపిల్లల విడుదల కార్యక్రమం పూర్తి చేయాలని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీపై జిల్లా మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నాణ్యతలో రాజీపడొద్దు...

ఈ ఏడాది 21,756 చెరువుల్లో 80.57 కోట్ల చేపపిల్లల్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 19.38 చేప పిల్లల్ని చెరువులు, కుంటల్లో విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో అధికారులు, మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాలు ఏ మాత్రం రాజీపడొద్దని స్పష్టం చేశారు. చేప పిల్లల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మత్స్యకారులను పూర్తిగా భాగస్వామ్యం చేయాలని మంత్రి తలసాని ఆదేశించారు. దృశ్యమాద్యమ సమీక్షలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ముదిరాజ్​లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే చేపపిల్లల పంపిణీ

19-09-2019 TG_HYD_63_19_MINISTER_VEDIO_CONFERENCES_AV_3038200 REPORTER : MALLIK.B Note : feed from desk whatsApp ( ) ఈ నెల 30వ తేదీ నాటి వరకు చేప పిల్లల విడుదల కార్యక్రమం పూర్తి చేయాలని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీపై సచివాలయం నుంచి మంత్రి... జిల్లా మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్య శాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 21, 756 నీటి వనరుల లో 80.57 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఈ నెల 16 వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు లో చేప పిల్లలు విడుదల చేసి కార్యక్రమం ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటి వరకు 5,958 నీటి వనరులలో 19.38 కోట్ల చేప పిల్లల విడుదల చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. చేప పిల్లల నాణ్యత, పరిమాణం విషయంలో మత్స్య శాఖ అధికారులు, మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘాలు, మత్స్యకారులు ఏ మాతం రాజీపడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మత్స్యకారులను పూర్తిగా భాగస్వాములను చేయాలని మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. VIS..........
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.