తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు కంపెనీలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. పౌల్ట్రీ రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని.. కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారని మంత్రి తెలిపారు.
రైతుల నినాదాలు
పౌల్ట్రీ ఎగ్జిబిషన్‌కు హాజరైన కొందరు రైతులు తమను ఆదుకోవాలంటూ ప్లకార్టు ప్రదర్శించారు. ఎగ్ బోర్డు ఏర్పాటుచేయాలని నినాదాలు చేశారు. దాణా పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్లో నిరసనలు మంచిది కాదని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ వారించారు.
ఇవీచూడండి: హైటెక్స్‌లో ఈ నెల 27 నుంచి పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన