ETV Bharat / city

వర్షం పడితే నీళ్లు రాకపోతే... నిప్పులు వస్తాయా?: మంత్రి తలసాని

నిజాన్ని ఒప్పుకోలేక కాంగ్రెస్‌ నేతలు పారిపోయారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లక్ష ఇళ్లను కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడైనా చూసుకోవచ్చని తెలిపారు. నిజాయతీగా చూపించినప్పుడు, అంతే నిజాయతీగా ఒప్పుకోవాలని హితవు పలికారు. పేదలకు ఇంత గొప్ప ఇళ్లు నిర్మించిన ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

Minister Talasani
Minister Talasani
author img

By

Published : Sep 18, 2020, 4:50 PM IST

హైదరాబాద్​ శివారులో నిర్మించే ఇళ్లల్లో 10 శాతం స్థానికులకు, 90 శాతం నగరవాసులకు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకులెవరూ జోక్యం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలను కూడా ఎన్నికల కోసమే అని విపక్షాలు అనటం దారుణమని మండిపడ్డారు. ఇళ్లను పరిశీలించడానికి ఇంజినీర్ల బృందం కావాలని కాంగ్రెస్​ నేతలు వెళ్లిపోయారని చెప్పారు.

హైదరాబాద్​లో వందల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో కాంగ్రెస్​ నేతలు చూపించాలని తలసాని సవాల్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తీసుకోవడానికి లబ్ధిదారులు కూడా రావటం లేదని ఎద్దేవా చేశారు. పేదలకు ఇంత గొప్ప ఇళ్లు నిర్మించిన ప్రభుత్వాలు ఉన్నాయా అని అన్నారు. లక్ష ఇళ్లను కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడైనా చూసుకోవచ్చని తెలిపారు. నిజాయతీగా చూపించినప్పుడు, అంతే నిజాయతీగా ఒప్పుకోవాలని... నిజాన్ని ఒప్పుకోలేక పారిపోయారని విమర్శించారు.

కరోనా కష్టకాలంలోనూ హైదరాబాద్​లో రోడ్లు, పార్కులు అభివృద్ధి చేసినట్లు తలసాని వెల్లడించారు. వర్షం పడితే నీళ్లు రాకపోతే... నిప్పులు వస్తాయా అని ప్రశ్నించారు. భారీ వర్షం కురిసినప్పటికీ వెంటనే సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

వర్షం పడితే నీళ్లు రాకపోతే... నిప్పులు వస్తాయా?: మంత్రి తలసాని

ఇదీ చదవండి: గ్రేటర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు స్థలం చూపిస్తా : భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.