ETV Bharat / city

ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా?: తలసాని - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తలసాని

గ్రేటర్‌ పోరులో తెరాస నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. డివిజన్లను చుట్టేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బన్సీలాల్‌పేట తెరాస అభ్యర్థి హేమలతకు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని తెలిపారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు.

బన్సీలాల్‌పేటలో తెరాస ఎన్నికల ప్రచారం
బన్సీలాల్‌పేటలో తెరాస ఎన్నికల ప్రచారం
author img

By

Published : Nov 22, 2020, 2:07 PM IST

హైదరాబాద్​- సికింద్రాబాద్​ జంటనగరాలను అభివృద్ధి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందని, ఇతర పార్టీలు హైదరాబాద్ అభివృద్ధిలో చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్​పేట తెరాస అభ్యర్థి హేమలతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి గురించి వివరించారు.

హైదరాబాద్​లో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదా అని తలసాని ప్రశ్నించారు. భాగ్యనగరంలోనే అత్యధిక డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు. లాక్​డౌన్, వరదల కారణంగా ఇళ్ల కేటాయింపుల్లో ఆలస్యం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అఖండ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బన్సీలాల్‌పేటలో తెరాస ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.