ETV Bharat / city

Telangana Tourism: 'పర్యటక రంగాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపిస్తాం'

కొవిడ్‌ కారణంగా పూర్తిగా నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కోరారు. టూర్​ ఆపరేటర్లకు ప్రత్యేక లోన్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

minister Srinivas goud
minister Srinivas goud
author img

By

Published : Jun 1, 2021, 3:55 PM IST

కరోనా మహమ్మారి కారణంగా పర్యటక రంగం పూర్తిగా కుదేలైందని.. పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటక రంగానికి సేవలందిస్తోన్న.. ఏజెంట్స్‌, టూర్‌ ఆపరేటర్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయారన్నారు. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్​ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రతినిధుల బృందం.. ఆపత్కాలంలో తమను ఆదుకోవాలంటూ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసింది.

ఏపీ, కేరళ రాష్ట్రాల మాదిరిగా.. టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ల కోసం ఉద్దీపన ప్యాకేజీలు, ప్రత్యేక లోన్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఛైర్మన్​ రమణ… మంత్రికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వారికి హామీ ఇచ్చారు. రంగాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్​ పిటిషన్​ తిరస్కరించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.