ETV Bharat / city

Gandhi hospital rape incident: బాధ్యులను విడిచిపెట్టేది లేదు: శ్రీనివాస్​గౌడ్​ - తెలంగాణ తాజా వార్తలు

గాంధీ ఆస్పత్రిలో (Gandhi hospital) అత్యాచార ఆరోపణల ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావును కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Srinivas goud
Srinivas goud
author img

By

Published : Aug 17, 2021, 7:59 PM IST

Updated : Aug 17, 2021, 10:34 PM IST

సికింద్రాబాద్​లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సందర్శించారు. గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణకు సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వ ఉపేక్షించబోదని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ ఉందని, సీసీ కెమెరాలు ఉన్నాయని శ్రీనివాస్‌గౌడ్‌ వివరించారు.

Gandhi hospital rape incident: బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: శ్రీనివాస్​గౌడ్​

అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రిలో ఏం జరిగిందనే విషయమై సూపరింటెండెంట్​తో పాటు ఇతర అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నాం. ఈనెల 5న ఆస్పత్రిలో చేరి 12న డిశ్చార్జి చేయకుండానే వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. దాదాపు 196 సీసీ కెమెరాలు ఉన్నాయి. 100కు పైగా సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. అసలు ఏమైందనేది దోషులను పట్టుకుంటేనేగాని తెలియదని ఆస్పత్రి అధికారులు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఆడవాళ్లపై అఘాయిత్యం చేసిన వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టదు. దిశ సంఘటన కూడా మీరు చూశారు. రాష్ట్రంలో షీటీమ్​లు వేసి ఎంత భద్రత కల్పిస్తున్నామో చూశారు. కచ్చితంగా బాధ్యులను విడిచిపెట్టం.- శ్రీనివాస్​ గౌడ్​, ఆబ్కారీ శాఖ మంత్రి

సమగ్ర దర్యాప్తు చేయండి: హోం మంత్రి

గాంధీ ఆస్పత్రిలో మహిళపై అత్యాచార ఆరోపణ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ... సీపీ అంజనీ కుమార్​ను ఆదేశించారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనపై ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ సమీక్షించారు. సీపీ అంజనీ కుమార్, అదనపు డీజీ షిఖా గోయల్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మహమూద్ అలీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని సీపీ అంజనీ కుమార్.. మంత్రులకు వివరించారు.

ఏం జరిగింది?

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ ఆ మహిళలకు దూరపు బంధువుకావడంతో.. వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా.. విషయం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తు ముమ్మరం

ఉమామహేశ్వర్‌ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని వెల్లడించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారని చెప్పారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు

Last Updated : Aug 17, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.