రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భాగ్య నగర్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో చిరు ఉద్యోగులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఐపీఎంలో పని చేస్తున్న వంద మంది నర్సులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ఈ సరుకులను మంత్రి అందజేశారు.
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వివిధ రంగాలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి దశల వారిగా ఈ సరుకులను అందజేయనున్నట్లు సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం'