రాష్ట్రం ఏర్పడిన నెల వ్యవధిలోనే తెరాస ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాయలసీమ, పోతిరెడ్డిపాడుపై సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిందని తెలిపారు. మిగులు జలాల్లో కింది రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ కూడా మిగులు జలాలు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపిందని తెలిపారు. కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం జీవోలు ఇస్తూ, అంచనాలు రూపొందిస్తోందన్నారు. గతంలో మీరు రిజర్వాయర్లు కట్టకుండానే కాల్వలు తవ్వాలని చూశారని చెప్పారు. నదీ జలాలతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయాలని సీఎం చూస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి : తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్ర జలశక్తి మంత్రి లేఖ