ETV Bharat / city

Medaram Jathara: మేడారం జాతర ఈసారి ప్రత్యేకం.. షిఫ్ట్​వైజ్​ దర్శనాలు, వీఐపీ పాసులు..

Medaram Jathara: త్వరలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. ఈసారి జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా అన్ని రకాల వసతులు కల్పించనుంది.

minister satyavathi ratod on Medaram amakka sarakka jathara

author img

By

Published : Jan 19, 2022, 3:50 PM IST

Medaram Jathara: చారిత్రాత్మక మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. ఈసారి జరిగే జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క జాతరపై శాసనమండలి సమావేశ మందిరంలో మంత్రి సత్యవతి రాఠోడ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 18వ తేదీన వస్తారనే సమాచారం ఉందని మంత్రి పేర్కొన్నారు.

అర్ధగంటలో దర్శనమయ్యేలా..

ఇప్పుడు సమక్క సారక్క దేవస్థానం పర్యాటక స్థలంగా మారిందని.. మంత్రి తెలిపారు. కరోనా కారణంగా భక్తులు ముందుస్తు దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు రోజుకు 3లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జంపన్నవాగు విషయంలో కొంత విమర్శలు వచ్చాయని.. ఇప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరలో మెడికల్ శిబిరాలు, మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. షిప్ట్‌వైజ్​గా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బయోటాయిలెట్లు- రెగ్యులర్ టాయిలెల్స్‌ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. భక్తులు గంటలపాటు క్యూ లైన్లలో నిల్చోకుండా అర గంటలో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వెల్లడించారు. వీఐపీ పాస్​పై టైమింగ్ స్లాట్‌ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

8 వేల బస్సులు..

సమ్మక్క జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కేంద్రాన్ని అడుగుతున్నామని తెలిపారు. జాతర సందర్భంగా ఎకరానికి 6 వేల చొప్పున రైతులకు నిధులు ఇస్తున్నామని.. ఇలా మొత్తం 1100 ఎకరాలకు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జాతరకు దగ్గరలో భూమి కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు. జాతరకు వచ్చే భక్తుల దాదాపు 8 వేల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.