ETV Bharat / city

తెలంగాణ వచ్చే వరకు ఒకెత్తు.. ఇప్పుడొకెత్తు: సత్యవతి రాఠోడ్ - హైదరాబాద్​ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. సర్కారు బడులకు డిమాండ్​ పెరిగిందని.. మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్​ను ఆమె ఆవిష్కరించారు. సమస్యల పరిష్కారంపై ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.

minister satyavathi rathod
తెలంగాణ వచ్చే వరకు ఒకెత్తు.. ఇప్పుడొకెత్తు: మంత్రి సత్యవతి
author img

By

Published : Dec 31, 2020, 7:40 PM IST

గురుకులాల్లో పిల్లల భవిష్యత్ కోసం అనేక ప్రయోగాలు చేస్తూ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మంచి విజయాలు నమోదు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు.

తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం డైరీ, క్యాలెండర్​ను ఆమె ఆవిష్కరించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గిరిజన గురుకులాలను చూస్తున్నానని.. తెలంగాణ వచ్చే వరకు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు అని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే వెనుకడుగు వేసేవారని, కానీ ఇప్పుడు సర్కారు బడులకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. దీనివల్ల బాధ్యత మరింత పెరిగిందని... ఇంకా నమ్మకం పెంచేలా పనిచేయాలని కోరారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని... మిగతా వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: విదేశీ డిగ్రీలను అనుమతించాలని హైకోర్టులో పిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.