ETV Bharat / city

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్​లో మంత్రి సత్యవతి రాఠోడ్ ఆకస్మిక తనిఖీ - మంత్రి సత్యవతి ఆకస్మిక తనిఖీ

Minister Satyavathi Rathod: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో వివిధ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కోసం కొనసాగుతున్న శిక్షణ తరగతులను మంత్రి పరిశీలించారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు.

Minister Satyavathi Rathod
Minister Satyavathi Rathod
author img

By

Published : May 29, 2022, 1:27 AM IST

Minister Satyavathi Rathod: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్​లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్​ను గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కోసం కొనసాగుతున్న శిక్షణ తరగతులను మంత్రి పరిశీలించారు. ఎంసెట్, ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో మంత్రి సత్యవతి రాఠోడ్ ముచ్చటించారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు వచ్చేవని... ఇప్పుడు గురుకుల విద్యార్థులు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు పొందుతున్నారని మంత్రి అన్నారు.

హాస్టల్​లో ప్రతిరోజు విద్యార్థులకు అందించే ఆహారం, రుచికరంగా, నాణ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ గతంలో ఎప్పుడూ లేనన్ని గురుకులాలు మంజూరు చేశారన్నారు. అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నాణ్యమైన భోజనం అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు వినియోగించుకుని రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. గురుకులాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... మంచి ఫలితాలు వచ్చేలా కష్టపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శి సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:'కేజీఎఫ్​' రాకీభాయ్​ మేనరిజం తెచ్చిన తంట.. ఆస్పత్రిపాలైన 15 ఏళ్ల కుర్రాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.