చిన్నారుల మధ్య మంత్రి సత్యవతి జన్మదిన వేడుకలు హైదరాబాద్ యూసఫ్ గూడ శిశువిహార్‌లో గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శిశువిహార్‌లోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి మంత్రి వేడుకలు చేసుకున్నారు. ఇకనుంచి పాఠశాలలోని పిల్లలందరికీ తానే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తానని తెలిపారు. అవిభక్త కవలలైన వీణ-వాణీలను పరామర్శించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు చెప్పారు.
ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా తన ఇద్దరు కుమారులతో కలిసి శిశువిహార్ ప్రాంగణంలో మూడు చొప్పున మొక్కలు నాటారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్పర్సన్ బిందును మొక్కలు నాటాల్సిందిగా సత్యవతి రాఠోడ్ కోరారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తా: పవన్