ETV Bharat / city

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: మంత్రి సబిత - సబితా ఇంద్రా రెడ్డి వార్తలు

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ తరగతులకు ముందు సర్వే నిర్వహించామని వివరించారు. డీడీ, టి-శాట్ యాప్‌లో డిజిటల్ క్లాసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వర్క్ షీట్స్ తయారుచేసినట్లు సభకు తెలిపారు. పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులపై మండలిలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు.

sabitha
sabitha
author img

By

Published : Sep 15, 2020, 1:09 PM IST

విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల సమయంలోనే లాక్​డౌన్​ విధించడం వల్ల ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ సాధ్యం కానందున వారిని కూడా ఉత్తీర్ణులుగా ప్రకటించామని వెల్లడించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీర్​ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచనలతో విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

అధిక ఫీజులు వసూలు చేయొద్దని సీఎం గట్టిగా చెప్పారు: మంత్రి సబిత

ఈ విద్యాసంవత్సరం అసలు పాఠశాలలు తీస్తారా అనే సందేహం ఉందని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్ క్లాసులు వినే గ్రామీణ విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తారా అని అడిగారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసులపై మండలిలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు. ఆన్‌లైన్ తరగతులకు ముందు సర్వే నిర్వహించామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 85 శాతం మంది విద్యార్థుల ఇళ్లలో టీవీ, 40 శాతం విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు‌ ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేని వాళ్లను పక్కవారితో అనుసంధానం చేశామని తెలిపారు.

డీడీ, టి-శాట్ యాప్‌లో డిజిటల్ క్లాసులు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వర్క్ షీట్స్ తయారుచేసినట్లు సభకు మంత్రి తెలిపారు. 3 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారని వెల్లడించారు. అధిక ఫీజులు వసూలు చేయొద్దని ప్రైవేటు విద్యాసంస్థలకు సీఎం గట్టిగా చెప్పారని సబిత వెల్లడించారు.

ఇదీ చదవండి: శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏం చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.