Minister Roja's Escort Driver: పర్యాటకశాఖ మంత్రి రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ఉద్యోగులు వెళ్లే బయోమెట్రిక్ మార్గం నుంచి సంప్రదాయ దుస్తులు ధరించకుండా వెళ్లారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సిబ్బంది అతడిని అడ్డగించారు. అనంతరం అతడిని మహాద్వారం నుంచి వెనక్కి పంపించారు.
నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నయనతార పాదరక్షలు ధరించి తిరుమాడ వీధుల్లో నడిచారని విమర్శలు రావడంతో తితిదే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారి బాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాడ వీధుల్లో నయనతార పాదరక్షలు ధరించడం దురదృష్టకరమన్నారు. ఆలయం ముందు ఫొటో షూట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. న్యాయనిపుణుల సలహాతో నయనతారపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫొటో షూట్ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నయనతార పాదరక్షలు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనన్న బాల్‌రెడ్డి... భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.
నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరు శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొందరు భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపారు. మరికొందరు ఫొటోలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేశ్ భార్యభర్తలుగా విచ్చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇవీ చదవండి :