ETV Bharat / city

'దేశంలో అన్ని అసెంబ్లీలకు రాష్ట్రం దిక్సూచిగా మారింది' - assembly sessions in telangana

ఫలవంతమైన చర్చతో దేశంలో అన్ని శాసనసభలకు తెలంగాణ దిక్సూచిలా మారిందని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. 8 రోజుల పాటు మంచి చర్చతో సభ హుందాగా జరిగిందన్న మంత్రి.. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరూ కూడా సభను స్తంభింపజేయలేదన్నారు.

minister prashanth reddy on assembly sessions

author img

By

Published : Sep 16, 2020, 9:22 PM IST

వర్షాకాల సమావేశాలు చాలా అర్థవంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఫలవంతమైన చర్చతో దేశంలో అన్ని శాసనసభలకు తెలంగాణ దిక్సూచిలా మారిందని మంత్రి పేర్కొన్నారు. 8 రోజుల పాటు మంచి చర్చతో సభ హుందాగా జరిగిందన్న మంత్రి.. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరూ కూడా సభను స్తంభింపజేయలేదన్నారు. క్లిష్టపరిస్థితుల్లో అందరూ సహకరించారని విజ్ఞప్తి చేశారు.

రెండు ప్రభుత్వ తీర్మానాలు, ప్రణబ్ ముఖర్జీ, రామలింగారెడ్డితో పాటు 9 మంది మాజీ సభ్యులకు నివాళులు, కీలకమైన రెవెన్యూ సహా 12 బిల్లులను ఆమోదించామని, మూడు అంశాలపై లఘుచర్చలు జరిగాయని ప్రశాంత్ రెడ్డి వివరించారు. చారిత్రాత్మక రెవెన్యూ బిల్లుకు ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. రైతులకు గుదిబండగా మారే కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. చాలా ముఖ్యమైన టీఎస్ బీపాస్ బిల్లును కూడా ఆమోదించుకున్నామని మంత్రి తెలిపారు.

పార్లమెంట్ సహా ఇతర సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని... ఇక్కడ మాత్రం కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని చెప్పారు. వీలైనన్ని ఎక్కువ రోజులు నడపాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్న ప్రశాంత్ రెడ్డి... సభ్యులు, సిబ్బంది, పోలీసులకు కొవిడ్ నిర్ధరణ అయిన నేపథ్యంలో సభాపతి అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 103 మంది సభ్యుల తెరాసకు సమానంగా మజ్లిస్, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారని... ప్రతిపక్షాలకు ఉదారంగా అవకాశాలు ఇచ్చారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో సభ్యుల అభిప్రాయాలను కేసీఆర్, కేటీఆర్ ఉదారంగా అంగీకరించారని చెప్పారు.

ఇదీ చూడండి: వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి : కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.