ETV Bharat / city

'అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా స్మారకం ఏర్పాటు...' - తెలంగాణ అమరవీరుల స్మారకం

ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా అమరులకు గౌరవం దక్కేలా తెలంగాణ అమరవీరుల స్మారకం రూపుదిద్దుకుంటోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వంద కోట్లతో నిర్మించనున్న ఈ స్మారక చిహ్నాన్ని... ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికా రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా స్మారకాన్ని ఏర్పాటు చేస్తున్నామంటున్న ప్రశాంత్‌రెడ్డితో ఈటీవీ ముఖాముఖి.

minister prashanth reddy interview on martyrs memorial in hyderabad

author img

By

Published : Sep 18, 2020, 5:00 PM IST

'అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా స్మారకం ఏర్పాటు...'

అమర వీరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా హైదరాబాద్‌ నడిబొడ్డున అమరవీరుల స్మారకం నిర్మిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తెలిపారు. అద్భుతమైన తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మించాలనేది సీఎం కేసీఆర్​ కల అని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో ఆరునెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికా రూపొందించామన్నారు.

ప్రముఖులు ఎవరొచ్చినా స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించేలా నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. స్మారకంలో ఆర్ట్‌ గ్యాలరీ, వీడియో గ్యాలరీ, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతిపెద్ద సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన మంత్రి... రాబోయే రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి స్మారకం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఇళ్ల లిస్ట్​ ఇస్తాం... మీరే తిరిగి చూసుకోండి : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.