ETV Bharat / city

సంక్షేమ పథకాల క్యాలెండర్​కు ఏపీ మంత్రివర్గం ఆమోదం - ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన

2021-22లో అమలు చేసే పథకాల క్యాలెండర్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబరులో కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం అమలు చేస్తామన్నారు.

perni nani
సంక్షేమ పథకాల క్యాలెండర్​కు ఏపీ మంత్రివర్గం ఆమోదం
author img

By

Published : Feb 24, 2021, 10:37 PM IST

ఏప్రిల్​లో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 2021-22లో అమలు చేసే పథకాల క్యాలెండర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏప్రిల్‌లో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేయనున్నట్లు వివరించారు. మే నెలలో మత్స్యకార భరోసా అమలు చేస్తామన్న ఆయన.. జూన్‌లో వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్న విద్యాకానుక అమలవుతాయన్నారు.

'జులైలో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం అమలు చేస్తాం. ఆగస్టులో నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇస్తాం. సెప్టెంబరులో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం, అక్టోబరులో రైతు భరోసా రెండో విడత, చేదోడు, తోడు పథకాలు, నవంబరులో కొత్తగా ఆమోదించిన ఈబీసీ నేస్తం, డిసెంబరులో 2, 3వ విడత విద్యాదీవెన, వసతిదీవెన, లా నేస్తం అమలు చేస్తాం'

- పేర్ని నాని, ఏపీ మంత్రి

జనవరి 22లోగా మూడో విడత రైతుభరోసా అమలు చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పారు. జనవరి 22లోగా అమ్మఒడి, పింఛను 2,500కు పెంపు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. దుర్గగుడిలో అనిశా సోదాలు చేస్తే వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు.

ఇవీచూడండి: ఉగాది తర్వాత రుణమాఫీ చేస్తాం: మంత్రి హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.