ETV Bharat / city

'రాహుల్ గాంధీకి దమ్ముంటే భాజపాపై యుద్ధం చేయాలి' - Rahul Gandhi Telangana tour

Niranjanreddy comments on Rahul Gandhi : వ్యవసాయశాఖ మంత్రి నిరంజ్​రెడ్డి కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్​లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ప్రస్తావనకు తెచ్చిన రైతు డిక్లరేషన్​పై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తారా..? అని ఎద్దేవా చేశారు.

Minister niranjanreddy comments on congress leaders on farmers declaration in telangana

author img

By

Published : May 7, 2022, 11:43 AM IST

Updated : May 7, 2022, 12:15 PM IST

'అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయరు కానీ.. తెలంగాణలో చేస్తారా..! అదెలా..?'

Niranjanreddy comments on Rahul Gandhi : కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని రైతు డిక్లరేషన్‌ను తెలంగాణలో అమలు చేస్తారా..? అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ తెరాసపై చేసిన ఆరోపణలను నిరంజన్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణ ఎవరి బిక్షమో కాదని.. పోరాడి సాధించుకున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ 28 రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాలకు కుచించుకుపోయిందని.. మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ 2లక్షల రుణమాఫీని 2018లోనే తెలంగాణ ప్రజలు తిరస్కరించారని... తెరాస ఇచ్చిన లక్ష రుణమాపీని ఆమోదించారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రుణమాఫీ పాక్షికంగా జరిగిందని.. ఇప్పుడు తప్పకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం వల్లే చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి విమర్శించారు. 2018 ఎన్నికల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చినా ప్రజలు తిరస్కరించారని.. మళ్లీ ఇప్పుడు కూడా అదే పాత పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం 15 వేల రూపాయలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అది వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు.

"ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో అమలు చేయకపోవడంతో ప్రజలు బుద్ధిచెప్పారు. రైతుల డిక్లరేషన్‌ పేరుతో నాటకాలు కట్టిపెట్టాలి. కాంగ్రెస్‌ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు అమలు చేశాయా..? మేనిఫెస్టోలో ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌కు అలవాటే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడెట్ల? ఆయకట్టు పెంచుడెట్ల?. రైతును రాజును చేయడం మీ వల్ల కాదు.. ముందు రాహుల్‌కు దమ్ముంటే భాజపాపై యుద్ధానికి సన్నద్దం కావాలి."

- నిరంజన్​రెడ్డి, మంత్రి

ఇదీ చూడండి:

Last Updated : May 7, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.