గతేడాది ఉద్యానపంటలను నమిలేసిన నల్లతామర తెగులు మళ్లీ విజృంభించకుండా.. దాన్ని అరికట్టే పురుగుమందులను త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. పెద్దఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేయబోతున్నందున రాష్ట్రంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్దేశించిన మేరకు ఈ పంటను ఏడాదిలో సాగుచేస్తే దానంతటికీ ఒక ఏడాదిలోనే డ్రిప్ సౌకర్యం కల్పించాలని కోరారు. మంగళవారం దిల్లీ వచ్చిన నిరంజన్‌రెడ్డి కేంద్రమంత్రిని కలిశారు.
- ఇదీ చూడండి: చేతినిండా సినిమాలున్నా.. కొత్త కథలకు ఓకే..!
"గత ఏడాది మిర్చి, మామిడి, ఇతర ఉద్యాన పంటలపై నల్లతామర తెగులు తీవ్ర ప్రభావం చూపింది. దీనికి కొత్త మందులు కనిపెట్టాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నరేంద్రసింగ్ తోమర్‌ను కోరాను. ఆయిల్‌పామ్‌కోసం తెలంగాణలో ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా కోరాను. ఇప్పటికే ఏపీలోని పెదవేగిలో కేంద్రం ఉన్నందున మరొకటి అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు 150 ఎకరాల భూమి చూశామని, అనుమతి ఇస్తే వెంటనే కేంద్రాన్ని నెలకొల్పవచ్చని వివరించాను. మా నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. రైతులపక్షాన కేంద్రమంత్రి చాలా సానుకూలంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా పంటల మార్పిడిపై ప్రధానమంత్రి స్థాయిలో ఒక ఉన్నతస్థాయి సమావేశం పెడుతున్నారు. మీ రాష్ట్రం తరఫున హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలని తోమర్ సూచించారు." - నిరంజన్‌రెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: