ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై... మొక్కలు నాటారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు హరితహారంలో సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భం ఏదైనా ఒక మొక్క నాటి, సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, తెరాస మల్కాజిగిరి పార్లమెంటు ఇంఛార్జీ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడిలో లోపాలున్నయ్.. వాస్తవమే: మంత్రి కేటీఆర్