కరోనా వ్యాప్తిని తెలంగాణ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల పరిధిలోని కండ్లకోయ జాతీయ రహదారి వద్ద నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి మొక్కలు నాటారు. ప్రజలు, అధికారుల సమన్వయంతోనే హరితహారం విజయవంతమవుతుందని తలసాని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని తలసాని స్పష్టం చేశారు. హరితహారాన్ని విజయవంతం చేసిన కౌన్సిలర్లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చేలా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని హరిత, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి: టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు.. ఆ తర్వాత?