తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్రవాహనాలను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది... గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చానన్న కేటీఆర్... తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు మొత్తంగా 90 అంబులెన్స్‌లను విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.
ముక్కోటి వృక్షార్చనకు పిలుపు...
ఈ నెల 24వ తేదీన తన జన్మదినం సందర్భంగా అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని కోరారు. అదే రోజున నిర్వహిస్తోన్న ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులు, అభిమానులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తన జన్మదినం రోజున బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం వృథాగా డబ్బు ఖర్చు చేయవద్దని కేటీఆర్ సూచించారు.
-
Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!
— KTR (@KTRTRS) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S
">Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!
— KTR (@KTRTRS) July 22, 2021
This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7SLast year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!
— KTR (@KTRTRS) July 22, 2021
This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S
కేటీఆర్ అడుగుజాడల్లోనే మేం కూడా...
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాము కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని తెరాస నేతలు ముందుకొచ్చారు. తాను కూడా 50 మంది దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు అందిస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామినవటం.. ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కూడా తన వంతుగా 20 ద్విచక్రవాహనాలను దివ్యాంగులకు అందిచనున్నట్లు తెలిపారు. కేటీఆర్ అడుగుజాడల్లోనే తాము కూడా పయనిస్తూ.. తన శక్తి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు.
తాము సైతం...
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తాము కూడా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీ చేస్తామని, ఇతర సాయం అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు సైదిరైడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్, ఇతర నేతలు ప్రకటించారు.